'విశ్వంభర' టీజర్ విడుదల అప్పుడేనా?

by సూర్య | Mon, Sep 23, 2024, 07:28 PM

మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని బింబిసార సినిమాతో ప్రఖ్యాతి గాంచిన వసిష్ఠ మల్లిడి దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. సోషియో-ఫాంటసీ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి 'విశ్వంబర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. వీఎఫ్‌ఎక్స్ వర్క్‌కు తగినంత సమయం ఉండేలా ఆగస్టు నాటికి మొత్తం షూట్‌ను ముగించాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రంలో భారీ VFX ఉంటుంది కాబట్టి, VFX పని కోసం భారీ బడ్జెట్ కేటాయించబడింది. విశ్వంబర గ్రాఫిక్స్‌పై పలు టాప్ వీఎఫ్‌ఎక్స్ కంపెనీలు పనిచేస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఈ సినిమా టీజర్ దసరా కి విడుదల చేయటానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా త్రిష కృష్ణన్ నటిస్తుంది. ఆషికా రంగనాథ్, రమ్య పసుపులేటి, ఈషా చావ్లా, అశ్రిత వేముగంటి నండూరి మరియు కునాల్ కపూర్‌ల ఈ సినిమాలో కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి అకాడమీ అవార్డ్-విజేత MM కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. విశ్వంబర జనవరి 10, 2025న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. UV క్రియేషన్స్ భారీ స్థాయిలోఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Latest News
 
'దేవర' రిలీజ్ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ Mon, Sep 23, 2024, 08:27 PM
వదిన గురించి నిహారిక ఏమన్నారంటే.. Mon, Sep 23, 2024, 07:56 PM
శ్రద్ధా దాస్ గ్లామర్ షో Mon, Sep 23, 2024, 07:45 PM
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'వెట్టయన్' ప్రివ్యూ Mon, Sep 23, 2024, 07:37 PM
'జనక అయితే గనక' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ Mon, Sep 23, 2024, 07:34 PM