అన్ని మ్యూజిక్ ప్లాటుఫార్మ్స్ లో అందుబాటులోకి వచ్చిన 'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ సింగల్

by సూర్య | Sat, Sep 21, 2024, 03:32 PM

సంగీత్ శోభన్, నార్నే నితిన్ మరియు రామ్ నితిన్ నటించిన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ మ్యాడ్ బాక్స్ఆఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అననతిక ​​సనీల్‌కుమార్, మరియు గోపికా ఉద్యాన్ మహిళా కథానాయికలుగా నటించారు. కళ్యాణ్ శంకర్ ఈ మ్యాడ్ క్యాప్ ఎంటర్‌టైనర్‌కి దర్శకత్వం వహించారు. మేకర్స్ ఇప్పటికే మ్యాడ్ స్క్వేర్ పేరుతో ఈ కామెడీ డ్రామాకి సీక్వెల్ ప్రకటించారు. మొదటి విడతకు మంచి రెస్పాన్స్ రావడంతో సీక్వెల్ భారీ స్థాయిలో తెరకెక్కనుంది. ఈ సీక్వెల్‌కి కూడా కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమాలోని ఎనర్జిటిక్ ట్రాక్ "లడ్డు గాని పెళ్లి" అనే టైటిల్ తో ఫస్ట్ సింగల్ ని విడుదల చేసారు. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఈ ట్రాక్‌కి మంగ్లీ గాత్రాన్ని అందించారు. కర్సాల శ్యామ్ సాహిత్యంతో చిత్రం యొక్క థీమ్ మరియు పాత్రలను సంపూర్ణంగా సంగ్రహించారు. ఈ పాటలో మ్యాడ్ బాయ్స్ గ్యాంగ్ - సంగీత్ శోభన్, నార్నే నితిన్ మరియు రామ్ నితిన్ - బీట్‌కు తగ్గట్టుగా గ్రూవ్ చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ అన్ని మ్యూజిక్ ప్లాటుఫార్మ్స్ లో ప్రసారానికి అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమా సాంకేతిక సిబ్బందిలో ఏస్ సినిమాటోగ్రాఫర్ షామ్‌దత్ సైనుదీన్ ISC, ఎడిటర్ నవీన్ నూలి మరియు రచయిత-దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఉన్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు చెందిన హారిక సూర్యదేవర, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌కి చెందిన సాయి సౌజన్యతో కలిసి మ్యాడ్ స్క్వేర్‌ను నిర్మిస్తున్నారు. నాగ వంశీ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

Latest News
 
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM
ఆయనతో వర్క్ చేయటం డ్రీమ్ కమ్ ట్రు అనిపించింది : మంజు వారియర్ Sat, Sep 21, 2024, 07:55 PM
'35-చిన్న కథ కాదు' డిజిటల్ ఎంట్రీ అప్పుడేనా? Sat, Sep 21, 2024, 07:32 PM