ఆపిల్ సినిమాస్ లో ఓపెన్ అయ్యిన 'దేవర' బుకింగ్స్

by సూర్య | Fri, Sep 20, 2024, 04:04 PM

శివ కోరటాల దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్‌ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'దేవర' అనే టైటిల్ ని లాక్ చేసారు. 2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో "దేవర: పార్ట్ 1" ఒకటి. ఈ చిత్రం సెప్టెంబర్ 27న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా బుకింగ్స్ ఆపిల్ సినిమాస్ లో ఓపెన్ అయ్యినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ పొన్నప, శృతి మురాతి, వంశి, శ్రీను, హిమజ కీలక పాత్రలో నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న "దేవర: పార్ట్ 1" ఎపిక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా నిలుస్తుంది. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Latest News
 
'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే...! Fri, Sep 20, 2024, 05:25 PM
'కళింగ' తొలి వారం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Sep 20, 2024, 05:21 PM
బిగ్ బాస్ 8 తెలుగు : విష్ణుప్రియపై ప్రేరణ కీలక వ్యాఖ్యలు Fri, Sep 20, 2024, 05:17 PM
'రక్త బ్రహ్మాండం' షూటింగ్ ప్రారంభించిన సమంత Fri, Sep 20, 2024, 05:13 PM
'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' 13 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే...! Fri, Sep 20, 2024, 04:36 PM