'వెట్టయన్' లో సత్యదేవ్ గా బిగ్ బి

by సూర్య | Fri, Sep 20, 2024, 03:52 PM

కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ తన తదుపరి చిత్రాన్ని జై భీమ్ ఫేమ్ TJ జ్ఞానవేల్ దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'వేట్టయాన్' అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ యాక్షన్ డ్రామాలో లెజెండరీ నటుడు పోలీసు పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే భారీ బజ్‌ని సృష్టించింది. సూపర్ కాప్ థ్రిల్లర్ తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ భాషలలో విడుదల కానుంది. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాసిల్, మంజు వారియర్, దుషార విజయన్, రితికా సింగ్, జిఎం సుందర్, రోహిణి, రావు రమేష్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అమితాబ్ బచ్చన్ యొక్క గ్లింప్సె ని విడుదల చేసారు. ఈ చిత్రంలో నటుడు సత్యదేవ్ అనే పాత్రలో నటిస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. సాంకేతిక సిబ్బందిలో సినిమాటోగ్రాఫర్ SR కతిర్ I.S.C మరియు ఎడిటర్ ఫిలోమిన్ రాజ్ ఉన్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రం అక్టోబర్ 10, 2024న థియేటర్లలోకి రానుంది. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాని సంగీతం సమకూరుస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌కు చెందిన సుభాస్కరన్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Latest News
 
'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే...! Fri, Sep 20, 2024, 05:25 PM
'కళింగ' తొలి వారం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Sep 20, 2024, 05:21 PM
బిగ్ బాస్ 8 తెలుగు : విష్ణుప్రియపై ప్రేరణ కీలక వ్యాఖ్యలు Fri, Sep 20, 2024, 05:17 PM
'రక్త బ్రహ్మాండం' షూటింగ్ ప్రారంభించిన సమంత Fri, Sep 20, 2024, 05:13 PM
'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' 13 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే...! Fri, Sep 20, 2024, 04:36 PM