నాగార్జున ఇంట్లో ఐస్ క్రీమ్ కు అంత ప్రత్యేకత..

by సూర్య | Fri, Sep 20, 2024, 02:07 PM

టాలీవుడ్  సీనియర్ హీరోలలో కింగ్ నాగార్జున  కూడా ఉన్నారు. ఒకప్పుడు తెలుగు సినీపరిశ్రమకు నాలుగు స్తంభాల్లా నిలిచిన వారిలో చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ తో పాటు నాగార్జున కూడా ఉన్నారు. టాలీవుడ్ లోని పెద్ద సినిమా ఫ్యామిలీలో నాగార్జున ప్యామిలీ కూడా ఒకటి. అక్కినేని వారసత్వాన్ని తీసుకుని.. ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ గా వెలుగొందారు నాగార్జున. నాగేశ్వరావు లెగసీని కాపాడుతూ.. కంటీన్యూ చేశారు కింగ్. ఇక నాగార్జున తరువాత ఆయన వారసత్వం తీసుకుని ఇండస్ట్రీకి వచ్చిన నాగచైతన్య, అఖిల్.. స్టార్లు గా మారలేకపోతున్నారు. హీరోలు గా తమనను తాము నిరూపించుకున్నా.. టైర్ 2 స్థాయి వరకే ఆగిపోయారు. 


ఎంత ప్రయత్నించినా.. ఈ ఇద్దరు వారసులను ఇండస్ట్రీలో ఓ స్థాయిలో నిలబెట్టలేకపోయారు నాగార్జున. చైతూ అంతో ఇంతో స్టార్ డమ్ సాధించాడు కాని.. అఖిల్ అయితే హీరోగా ఏమాత్రం నిలబడలేకపోతున్నాడు ఇప్పటికే ఆయన చేసిన సినిమాలన్నీటిలో సాలిడ్ హిట్ ఒక్కటి కూడా లేదు. ఒకటి రెండు యావరేజ్ సినిమాలు మాత్రమే ఉన్నాయి. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో నాగార్జున ఫ్యామిలీకి స్టూడియోలు ఉండటం, నిర్మాతలుగా  ఉండటం, పలు బిజినెస్ లలో కూడా వారు రాణిస్తుండటంతో..  టాలీవుడ్ లో తిరుగు లేని స్టార్ డమ్ ను వారు కొనసాగిస్తున్నారు. అదే ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేని హీరోలు అయితే..  ఈ పాటికి ఇండస్ట్రీ నుంచి మాయం అయ్యేవారేమో. 


 


కాగా కింగ్ నాగార్జున ఫుడ్ హ్యాబిట్ కు సబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందులో నాగార్జున నైట్ అస్సలు మిస్ అవ్వకుండా తినే ఓ ఫుడ్ ఐటమ్ గురించి ఓ వీడియో వైరల్ అవుతోంది. అదేంటంటే.. నాగార్జున నైట్ మిస్ అవ్వకుండా పక్కాగా ఐస్ క్రీమ్ తింటారట. అది తినకుండా ఆయన అస్సలు పడుకోరట.


ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆఞనే స్వయంగా వెల్లడించారు. నేను రోజు రాత్రం ఖచ్చితంగా ఐస్ క్రీమంత్ తింటాను.. అది తినకుండా నేను పడుకోను అన్నారు కింగ్. అంతే కాదు నాగార్జునతో పాటు.. వారి ఇంట్లో వారికి కూడా ఫెవరేట్ ఫుడ్ ఐటమ్ ఏంది అంటే ఐస్ క్రీమ్ అనే సమాధానం వస్తుంది. గతంలో హీరో శర్వానంద్ అఖిల్ తో పాటు అమలను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో మీకు ఫెవరేట్ ఫుడ్ ఏదీ అని అడిగితే.. అఖిల్ తో పాటు అమల కూడా ఐస్ క్రీమ్ అని చెప్పింది. దాంతో ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఐస్ క్రీమ్ లు తిని బ్రతికేస్తున్నారా అని శర్వానంద్ జోక్ చేశారు  కూడా. ఇలా నాగార్జున ఇంట్లో ఐస్ క్రీమ్ కు అంత ప్రత్యేకత ఉంది. ఇక 65 ఏళ్ళ వయస్సులో కూడా దూసుకుపోతున్నారు నాగార్జున. అదే ఫిట్ నెస్ తో హ్యాండ్సమ్ హీరోగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ను హోస్ట్ చేస్తున్న కింగ్.. తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తున్నారు. ధనుష్ మూవీతో పాటు.. రజినీకాంత్ మూవీలో కూడా ఆయన నటిస్తున్నారు.   

Latest News
 
కూలి నంబర్ 1 షూటింగ్ పూర్తయ్యాక ఒక ఆసక్తికర సంఘటన .. Fri, Sep 20, 2024, 04:16 PM
తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన కోలీవుడ్ స్టార్ హీరో Fri, Sep 20, 2024, 04:15 PM
నేడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి Fri, Sep 20, 2024, 04:09 PM
'మ్యాడ్ స్క్వేర్' నుండి ఎనర్జిటిక్ లడ్డు గానీ పెళ్లి సాంగ్ అవుట్ Fri, Sep 20, 2024, 04:09 PM
ఆపిల్ సినిమాస్ లో ఓపెన్ అయ్యిన 'దేవర' బుకింగ్స్ Fri, Sep 20, 2024, 04:04 PM