రేపే 'మారుతీ నగర్‌ సుబ్రమణ్యం' డిజిటల్ ఎంట్రీ

by సూర్య | Thu, Sep 19, 2024, 07:04 PM

లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు రావు రమేష్‌ నటించిన 'మారుతీ నగర్‌ సుబ్రమణ్యం' సినిమా ఆగష్టు 23న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా గ్రాండ్ ప్రీమియర్ షోకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రావు రమేష్ నటనకి భారీ రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా వీడియో సొంతం చేసుకుంది. ఈ సినిమా సెప్టెంబర్ 20న అంటే రేపు స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. పూర్తిగా వినోదభరితమైన కామెడీ-డ్రామాగా పేర్కొనబడిన ఈ చిత్రాన్ని క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ సుకుమార్ భార్య తబిత సుకుమార్ సమర్పిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల చేసారు. ఈ చిత్రంలో అంకిత్ కొయ్య, ఇంద్రజ, రమ్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.


 

Latest News
 
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM