'సత్యం సుందరం' విడుదలకి తేదీ ఖరారు

by సూర్య | Thu, Sep 19, 2024, 02:39 PM

సి. ప్రేమ్ కుమార్‌ దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు కార్తీ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం చేయడమే కాకుండా, ప్రేమ్ కుమార్ ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే మరియు డైలాగ్‌లు రాశారు. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'మెయ్యళగన్' అనే టైటిల్‌ ని లాక్ చేసారు. ఈ సినిమా తెలుగులో సత్యం సుందరం అనే టైటిల్ తో విడుదల కానుంది. ఈ సినిమా యొక్క తెలుగు థియేటర్ రైట్స్ ని ప్రముఖ ప్రొడక్షన్ బ్యానర్ ఆసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ LLP సొంతం చేసుకుంది. తాజాగా మూవీ మేకర్స్ సత్యం సుందరం చిత్రం  సెప్టెంబర్ 28న విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. అరవింద్ స్వామి కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో రాజ్‌కిరణ్, శ్రీ దివ్య, స్వాతి కొండే, దేవదర్శిని, జయప్రకాష్, శ్రీ రంజని, ఇళవరసు, కరుణాకరన్, శరణ్, రేచల్ రెబెక్కా, ఆంథోని, రాజ్‌కుమార్, ఇందుమతి, రాణి సంయుక్త, కాయల్ సుబ్రమణి, అశోక్ పాండియన్ తదితరులు కీలక పాత్రలలో నటించారు. గోవింద్ వసంత ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌పై జ్యోతిక మరియు సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, రాజశేఖర్ కర్పూరసుందరపాండియన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Latest News
 
నేడు మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. రూ.99కే సినిమా చూసే ఛాన్స్‌ Fri, Sep 20, 2024, 10:27 AM
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM