బాలీవుడ్‌ లోకి సూర్య, వార్తలు హల్చల్

by సూర్య | Mon, Sep 16, 2024, 08:25 PM

బాలీవుడ్‌ యాక్షన్‌ ఫిల్మ్స్‌  ‘ధూమ్‌’ సిరీస్‌ చిత్రాలు ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే! 2004లో వచ్చిన తెరకెక్కిన ఈ చిత్రానికి మూడు సీక్వెల్స్‌ వచ్చి బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ సక్సెస్‌ అయ్యాయి. ఈ ఫ్రాంఛైజీలో  ‘ధూమ్‌ 4’ పట్టాలెక్కనున్నట్లు కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ ఈమేరకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘ధూమ్‌, పార్ట్‌ 2, 3’లకు కథను అందించిన ఆదిత్య చోప్రానే  ఈ సినిమాకీ వర్క్‌ చేస్తున్నారని.. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు అనుగుణంగా భారీ స్థ్థాయిలో దీనిని సిద్థం చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. కోలీవుడ్‌ నటుడు సూర్య ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో సూర్య నటించనున్నారని.. ఈ విషయంపై చిత్రబృందం ఇప్పటికే ఆయన్ని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రోల్‌లో యాక్ట్‌ చేేసందుకు ఆయన ఆసక్తి చూపారని టాక్‌. అభిమానులంతా అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. అయితే నెగటివ్‌ షేడున్న పాత్రలు సూర్యకు కొత్తేమీ కాదు. ‘24’, ‘విక్రమ్‌’ చిత్రాల్లో నెగటివ్‌ రోల్స్‌ చేశారు. ‘విక్రమ్‌’లో రోలెక్స్‌ పాత్రలో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. మాదక ద్రవ్యాల ముఠాకు నాయకుడిగా ఆయన నటన అందర్నీ కట్టిపడేసింది.  

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM