నేడే 'అలనాటి రామచంద్రుడు' ట్రైలర్ రిలీజ్

by సూర్య | Sat, Jul 27, 2024, 02:46 PM

చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వంలో 'అలనాటి రామచంద్రుడు' సినిమాతో కృష్ణవంశీ తెలుగు ఇండస్ట్రీలో తెరంగేట్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో మోక్ష కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ఆగష్టు 2, 2024న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ఈరోజు మధ్యాహ్నం 4:05 గంటలకి విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సీనియర్ నటి సుధ, ప్రమోధిని, వెంకటేష్ కాకమును, చైతన్య గరికిపాటి కూడా కీలక పాత్రలో నటించారు. శశాంక్ తిరుపతి స్వరాలు సమకూర్చగా, ప్రేమ్ సాగర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ ప్రేమకథని హైనివా క్రియేషన్స్ బ్యానర్‌పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మించారు.

Latest News
 
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM