భారతీయుడు 2 మూవీ రివ్యూ.. ఎలా వుందంటే....?

by సూర్య | Fri, Jul 12, 2024, 01:50 PM

హీరో కమల్ హాసన్ నటించిన పాన్ ఇండియా మూవీ భారతీయుడు-2 . ఈ సినిమాని టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించారు. భారతీయుడు 2 మూవీ ఎలా ఉందో అనే ఆసక్తి జనాల్లో పెరిగింది. ఈ రోజు రిలీజ్ అయిన ఈ మూవీ ఆడియన్స్ అంచనాలను అందుకుందో లేదో ఇప్పుడు చూద్ధాం…


కథ ఏమిటంటే...?: సమాజంలో జరిగే అన్యాయాన్ని యూట్యూబ్ లో చూపిస్తూ అవేర్నెస్ తెప్పించాలని అనుకుంటారు చిత్ర అరవిందన్ … (సిద్ధార్థ్) అండ్ టీం. దీని వల్ల కష్టాలు వస్తాయే తప్పా… ఎలాంటి ప్రయోజనం లేదు అని చిత్ర అరవిందన్‌తో దిశ (రకుల్ ప్రీత్ సింగ్) చెబుతుంది. అయితే, ఈ అవినీతి సమాజాన్ని సరి చేయడం తమ వల్ల కాదు… ఇండియన్ రావాల్సిందే అని #ComeBackIndian అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తారు చిత్ర అరవిందన్ అండ్ టీం. అది… తైవాన్‌లో ఉన్న ఇండియన్ / సేనాపతి (కమల్ హాసన్) వరకు వెళ్తుంది. అక్కడే ఓ అడ్డదారిలో కోట్లు సంపాదించిన అతన్ని చంపి… ఇండియాకు తిరిగి వస్తాడు హీరో. అప్పటికే సేనాపతిని అరెస్ట్ చేయడానికి సీబీఐ అధికారి ప్రమోద్ (బాబీ సింహా) చూస్తుంటాడు.


 


సేనాపతి ఇండియా వచ్చి సీబీఐ నుంచి తప్పించుకుని అవినీతి ఎలా అరికట్టాడు..? దానికి చిత్ర అరవిందన్ అండ్ టీం ఎలా సహాకరించింది..? దాని వల్ల వాళ్లు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? సకలకళా వల్లభుడు (ఎస్ జే సూర్య) ఎందుకు సేనాపతిని చంపాలి అనుకున్నారు..? చివరికి సేనాపతిని బాబీ సింహా అరెస్ట్ చేశారా ? అనేది కథ. 


 


ఇక కమల్ హాసన్ యాక్టింగ్ గురించి చెప్పుకోవాలంటే.. వన్ మెన్ షో. సినిమాకు కావాల్సినంత చేశాడు. ఇంకా చెప్పాలంటే.. అంతకు మించి చేశాడు. సిద్ధార్థ్ ఫర్మామెన్స్ కూడా బాగానే ఉంది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ ఎందుకు ఉందో అర్థం కాదు. పార్ట్ 3లో అయినా, ఆమెకు ఇంపార్టెన్స్ ఉంటుందో చూడాలి. బాబీ సింహా ఆకట్టుకున్నాడు. ఈయనకు పార్ట్ 3లో మంచి పాత్ర ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఎస్ జే సూర్య మెయిన్ విలన్ అని అర్థమవుతుంది. భారతీయుడు 3లో కమల్ హాసన్ – ఎస్ జే సూర్య మధ్యే ఫైట్ ఉండబోతుంది. సంగీతం కొన్ని చోట్ల మెప్పించింది. కొన్ని చోట్ల చేతులెత్తేసింది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. ఎడిటింగ్ వర్క్ మరింత జరగాల్సింది. చూడాలి ఈ సినిమా ప్రేక్షకులనుండి ఎంత కలెక్షన్ రాబడుతుందో...

Latest News
 
'పుష్ప 2' గురించి అనసూయ భరద్వాజ్ కీలక వ్యాఖ్యలు Thu, Oct 31, 2024, 06:19 PM
సల్మాన్ ఖాన్‌కి మరో హత్య బెదిరింపు Thu, Oct 31, 2024, 06:13 PM
దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన 'రామం రాఘవం' టీమ్ Thu, Oct 31, 2024, 06:06 PM
డిజిటల్ భాగస్వామిని లాక్ చేసిన 'అమరన్‌' Thu, Oct 31, 2024, 06:01 PM
'దేవకి నందన వాసుదేవ' స్పెషల్ దివాళీ ఇంటర్వ్యూ అవుట్ Thu, Oct 31, 2024, 05:52 PM