డబ్బింగ్ దశలోకి ఎంట్రీ అయ్యిన 'దేవర'

by సూర్య | Fri, Jul 12, 2024, 01:48 PM

కొరటాల శివ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక చిత్రాన్ని ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ చిత్రానికి 'దేవర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఈ సినిమా గ్లింప్స్ మరియు ఫస్ట్ సింగిల్‌కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజా సమాచారం ప్రకారం, మూవీ మేకర్స్ ఈ సినిమా డబ్బింగ్ ని ప్రారంభించినట్లు సమాచారం. ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్న వంశి, శ్రీను, హిమజ దేవర మూవీకి డబ్బింగ్ ని ప్రారంభించినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, శృతిమరాఠే, తారక్ పొన్నప కీలక పాత్ర పోషిస్తున్నారు. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఎ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
'గేమ్ ఛేంజర్' టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Oct 31, 2024, 04:39 PM
బ్లడీ బెగ్గర్ పీక్ విడుదలకి టైమ్ లాక్ Thu, Oct 31, 2024, 04:35 PM
'కన్నప్ప' నుండి దివాళీ స్పెషల్ పోస్టర్ అవుట్ Thu, Oct 31, 2024, 04:29 PM
'లక్కీ బాస్కర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫారం Thu, Oct 31, 2024, 04:26 PM
నవంబర్ 9న గేమ్ ఛేంజర్ టీజర్ విడుదల Thu, Oct 31, 2024, 04:24 PM