by సూర్య | Thu, Jul 11, 2024, 05:19 PM
కోలీవుడ్ నటి ఐశ్వర్య రాజేష్ కన్నడ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంది. ఇటీవలే ఈ బ్యూటీ కన్నడలో తన కొత్త సినిమా 'ఉత్తరకాండ' ను ప్రకటించింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న కన్నడ స్టార్ నటుడు శివ రాజ్ కుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నటుడి ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. ఈ సినిమాలో నటుడు మాలిక అనే పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, ధనంజయ, చైత్ర జె ఆచార్, విజయ్ బాబు, దిగంత్, యోగరాజ్ భట్, రంగాయణ రఘు, గోపాలకృష్ణ దేశ్‌పాండే, ఉమాశ్రీ మరియు ఇతర నటీనటులు కీలక పత్రాలు పోషిస్తున్నారు. KRG స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి రోహిత్ పడకి దర్శకత్వం వహిస్తున్నారు. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Latest News