వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'లైగర్'

by సూర్య | Thu, Jul 11, 2024, 03:22 PM

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన "లైగర్" సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా జులై 11న మధ్యాహ్నం 4 గంటలకి స్టార్ మా ఛానల్ లో ప్రీమియర్ కానున్నట్లు సమాచారం. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు.

Latest News
 
AV చూసి ఎమోషనల్ అయిన హీరో శివ కార్తికేయన్ Sun, Oct 27, 2024, 12:55 PM
రాయల్ లుక్ లో రాధికా పండిట్ ! Sun, Oct 27, 2024, 12:09 PM
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM
లోకేష్ కనగరాజ్ షార్ట్ ఫిల్మ్ గురించిన అప్డేట్ Sat, Oct 26, 2024, 08:47 PM