సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న భారతీయుడు-2 మూవీ.. రన్ టైం ఎంతంటే...?

by సూర్య | Thu, Jul 11, 2024, 12:38 PM

యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసర్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘భారతీయుడు-2.’ 1996లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతోంది. తాజాగా, ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. మొత్తం భారతీయుడు 2 మూవీ రన్ టైమ్ 180.04 నిమిషాలు ఉండనుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక, ఈ సినిమా జూలై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది


ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు.ఇటీవల హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ మూవీలో కమల్ హాసన్, సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, ఎస్ జె సూర్య, బాబీ సింహా, ప్రయా భవానీ శంకర్, సముద్రఖని, బ్రహ్మానందం తదితరులు నటించారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ రవిచంద్రన్ వ్యవహరించాడు.

Latest News
 
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM
అశ్వత్ మరిముత్తుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన శింబు Fri, Oct 25, 2024, 08:06 PM
మైసూరులో 'RC16' ఫస్ట్ షెడ్యూల్? Fri, Oct 25, 2024, 07:58 PM