సూర్య ఫాంటసీ యాక్షన్ డ్రామా 'కంగువ' కు సీక్వెల్ కన్ఫర్మ్

by సూర్య | Wed, Jul 10, 2024, 08:10 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన తదుపరి సినిమాని దర్శకుడు సిరుత్తై శివతో అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాకు 'కంగువ' అనే టైటిల్‌ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా అక్టోబర్ 10, 2024న విడుదల కానుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కె.ఇ.జ్ఞానవేల్ రాజా కంగువ రెండు భాగాల సినిమా అని వెల్లడించారు. నిర్మాత మాట్లాడుతూ... పార్ట్ 1, పార్ట్ 2కి కథ రాసుకున్నాం. మొదటి భాగాన్ని పూర్తి చేశాం. మేము ఇంకా సీక్వెల్ నిర్మాణాన్ని ప్రారంభించాల్సి ఉంది. కంగువ 1 చిత్రీకరణను పూర్తి చేయడానికి మేము 185 రోజులు తీసుకున్నాము. రెండవ భాగం 2025 చివరిలో లేదా 2026 ప్రారంభంలో ప్రారంభమవుతుంది. కంగువ 2ని 2027 జనవరి లేదా వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. పార్ట్ 1 ని నీట్ గా తీస్తే పార్ట్ 2 ఎలాగైనా ఆదుకుంటుంది. మొదటి భాగం చివర్లో ప్రేక్షకులను సీక్వెల్‌కి కట్టిపడేసేలా ఎగ్జైటింగ్‌గా ఉంది అని అన్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దిశా పటానీ సూర్య సరసన జోడిగా నటిస్తుంది. ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌కి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్లపై వంశీకృష్ణ, ప్రమోద్, కెఇ జ్ఞానవేల్రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'డార్లింగ్' Thu, Jul 18, 2024, 05:30 PM
7M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'డబుల్ ఇస్మార్ట్' సెకండ్ సింగల్ Thu, Jul 18, 2024, 05:29 PM
డిజిటల్ ఎంట్రీ తేదీని లాక్ చేసిన 'రాజు యాదవ్' Thu, Jul 18, 2024, 05:27 PM
50M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'మహారాజా' Thu, Jul 18, 2024, 05:25 PM
'థగ్ లైఫ్' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Jul 18, 2024, 05:23 PM