'ఆపరేషన్ రావణ్' ట్రైలర్ అవుట్

by సూర్య | Wed, Jul 10, 2024, 04:27 PM

వెంకట సత్య దర్శకత్వంలో హీరో రక్షిత్ అట్లూరి తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'ఆపరేషన్ రావన్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా ట్రైలర్ ని మాస్ కా దాస్ విశ్వేక్ సేన్ విడుదల చేసినట్లు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ సినిమా ఆగష్టు 2, 2024న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో సంగీత విపిన్ కథానాయికగా నటించారు. ద్విభాషా సైకో థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాలో రాధికా శరత్‌కుమార్, చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె, KA పాల్ రాము, విద్యా సాగర్, TV5 మూర్తి, కార్తీక్ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శరవణ వాసుదేవన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
ఓటీటీలోకి 'ఆడు జీవితం'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Sun, Jul 14, 2024, 02:11 PM
అందుకే లిప్స్ ఇలా మారాయి.. శ్రీసత్య Sun, Jul 14, 2024, 12:01 PM
ఇవాళ తనికెళ్ల భరణి పుట్టినరోజు Sun, Jul 14, 2024, 11:22 AM
ఫుల్ స్వింగ్ లో 'విశ్వంభర' మ్యూజిక్ సిట్టింగ్స్ Sat, Jul 13, 2024, 05:41 PM
'కల్కి 2898 AD' OST రిలీజ్ Sat, Jul 13, 2024, 05:40 PM