'మిస్టర్ బచ్చన్' నుండి సితార సాంగ్ అవుట్

by సూర్య | Wed, Jul 10, 2024, 02:37 PM

మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజతో ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి తెలిసందే. ఈ సినిమాకి మిస్టర్ బచ్చన్ - నామ్ తో సునా హోగా అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. భారతీయ పారిశ్రామికవేత్త సర్దార్ ఇందర్ సింగ్‌పై దాదాపు 3 రోజుల పాటు జరిగిన నిజ జీవిత ఆదాయపు పన్ను దాడి ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ని సితార అనే టైటిల్ తో విడుదల చేసారు. రవితేజ సరసన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో సత్య, జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

Latest News
 
ఉస్తాద్ భగత్ సింగ్‌లో తొలిప్రేమ పాట రీక్రియేషన్! Mon, Mar 16, 2026, 03:41 PM
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ కు మెగా స్టార్ చిరంజీవి ప్రశంసలు Sun, Mar 15, 2026, 02:42 PM
పాతాళ భైరవి సినిమాకు 75 ఏళ్లు పూర్తి Sun, Mar 15, 2026, 02:18 PM
ప్రముఖ బాలీవుడ్ నటి మధు మల్హోత్రా కన్నుమూత Sun, Mar 15, 2026, 02:17 PM
సుకుమార్-రామ్ చరణ్ సినిమా.. DSPకి బ్రేక్? Sun, Mar 15, 2026, 11:56 AM