'బ్రిందా' డిజిటల్ ఎంట్రీ తేదీ ఖరారు

by సూర్య | Tue, Jul 09, 2024, 03:15 PM

సూర్య వనగల దర్శకత్వంలో చెన్నై తెండ్రాల్ త్రిష తెలుగులో 'బ్రిందా' అనే వెబ్ సిరీస్ లో నటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని సోనీ LIV సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ సోనీ లైవ్‌లో ఆగష్టు 2న ప్రసారానికి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు డిజిటల్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సిరీస్ లో త్రిష ఎస్‌ఐ బృందా పాత్రను పోషిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్‌గా ట్రాక్ లో రానున్న ఈ సిరీస్ లో  సాయి కుమార్, ఆమని, ఇంద్రజిత్ సుకుమారన్, రవీంద్ర విజయ్, ఆనంద్ సామి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శక్తికాంత్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. టాలీవుడ్ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా తన సోదరుడు ఆశిష్ కొల్లాతో కలిసి ఈ వెబ్ సిరీస్‌ ని నిర్మిస్తున్నారు.

Latest News
 
ఓటీటీలోకి 'ఆడు జీవితం'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Sun, Jul 14, 2024, 02:11 PM
అందుకే లిప్స్ ఇలా మారాయి.. శ్రీసత్య Sun, Jul 14, 2024, 12:01 PM
ఇవాళ తనికెళ్ల భరణి పుట్టినరోజు Sun, Jul 14, 2024, 11:22 AM
ఫుల్ స్వింగ్ లో 'విశ్వంభర' మ్యూజిక్ సిట్టింగ్స్ Sat, Jul 13, 2024, 05:41 PM
'కల్కి 2898 AD' OST రిలీజ్ Sat, Jul 13, 2024, 05:40 PM