నైజాంలో మొదటి రోజు 'కల్కి' రికార్డు సృష్టించనుందా?

by సూర్య | Wed, Jun 26, 2024, 04:30 PM

నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాకి మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ కల్కి 2898 AD అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా జూన్ 27, 2024న విడుదల కానుంది. ఈ చిత్రం యొక్క నైజాం రైట్స్ ని గ్లోబల్ సినిమాస్ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్‌లు భారతదేశంలోని ప్రతి మూలలో భారీగా ప్రారంభమయ్యాయి. ఈ సినిమా నైజాంలో మొదటి రోజు ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతోంది. తొలిరోజు అంచనాల ప్రకారం ఒక్క నైజాంలోనే మొదటి రోజు దాదాపు 35 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుంది అని భావిస్తున్నారు. మరి కల్కి విడుదల తర్వాత ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఈ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో యంగ్ రెబెల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె నటిస్తుంది. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో కమల్ హాసన్, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ మరియు ఇతరులు కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ హై బడ్జెట్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
సుమతో 'మట్కా' బృందం దివాళీ స్పెషల్ ఇంటర్వ్యూ అవుట్ Thu, Oct 31, 2024, 07:42 PM
'ఎల్2 ఎంపురాన్' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Oct 31, 2024, 07:39 PM
బ్లడీ బెగ్గర్ నుండి బెగ్గర్ పీక్ రిలీజ్ Thu, Oct 31, 2024, 07:30 PM
నేడు మల్లికార్జున థియేటర్ ని విసిట్ చేయనున్న 'క' బృందం Thu, Oct 31, 2024, 07:26 PM
100M+ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్లాక్ చేసిన 'కళింగ' Thu, Oct 31, 2024, 07:21 PM