by సూర్య | Wed, Jun 26, 2024, 03:54 PM
భరత్ కృష్ణమాచారి దర్శకత్వం లోటాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'స్వయంభూ' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రంలో నిఖిల్ సరసన జోడిగా సంయుక్త నటిస్తుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క కొత్త షెడ్యూల్ ని మారుడెమల్లి ఫారెస్ట్ లో ప్రారంభించినట్లు సమాచారం. ఈ షెడ్యూల్ లో నిఖిల్ పై చిత్ర బృందం కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించనుంది. ఈ చిత్రంలో నభానటేష్ కీలక పాత్రలో నటిస్తుంది. ఈ పాన్ ఇండియా సినిమాకి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఎం ప్రభాహరన్ సెట్టింగ్స్ డిజైన్ చేయగా, వాసుదేవ్ మునెప్పగారి డైలాగ్స్ అందిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Latest News