by సూర్య | Wed, Jun 26, 2024, 03:48 PM
సుమన్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'సత్యభామ' జూన్ 7న విడుదల అయ్యింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని కళ్లారా వీడియో సాంగ్ ని ఆదిత్య మ్యూజిక్ లో విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ చిత్రంలో నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. మేజర్ మరియు గూఢచారి ఫేమ్ శశి కిరణ్ తిక్క ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఔరుమ్ ఆర్ట్స్ బ్యానర్‌పై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Latest News