by సూర్య | Wed, Jun 26, 2024, 02:56 PM
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని మరియు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'డబుల్ ఇస్మార్ట్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా ఆగష్టు 15, 2024న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా 50 రోజుల కౌంట్‌డౌన్‌లో థియేటర్లలోకి రానుంది అని తెలియజేసేందుకు చిత్ర బృందం స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ సినిమాల్లోని ప్రేక్షకులను ఆకట్టుకునేలా పలు భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. పూరి జగన్నాధ్ మరియు ఛార్మి కౌర్ కలిసి పూరీ కనెక్ట్స్‌పై, విషు రెడ్డి CEOగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Latest News