విడుదల తేదీని లాక్ చేసిన 'ఆయ్'

by సూర్య | Tue, Jun 25, 2024, 01:24 PM

టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్ కొత్త దర్శకుడు అంజి కంచిపల్లితో తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'ఆయ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. బన్నీ వాస్‌తో పాటు విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాని ఆగష్టు 15న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం ఆన్లైన్ లో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో నయన్ సారిక కథానాయికగా నటించింది. రామ్ మిరియాల ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా, సమీర్ కళ్యాణి సినిమాటోగ్రఫీని నిర్వహించారు. అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు.

Latest News
 
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM
అశ్వత్ మరిముత్తుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన శింబు Fri, Oct 25, 2024, 08:06 PM
మైసూరులో 'RC16' ఫస్ట్ షెడ్యూల్? Fri, Oct 25, 2024, 07:58 PM