by సూర్య | Sat, Jun 22, 2024, 04:52 PM
రైటర్ మోహన్ దర్శకత్వంలో వెన్నెల కిషోర్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ కి జోడిగా అనన్య నటిస్తుంది. మూవీ మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ సింగల్ ని మా ఊరు శ్రీకాకుళం అనే టైటిల్ తో ఆవిష్కరించారు. శ్రీకాకుళం నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ సునీల్ కశ్యప్ స్వరపరిచిన 'మా ఊరు శ్రీకాకుళం' సాంగ్ శ్రీకాకుళం స్ఫూర్తిని సంపూర్ణంగా చిత్రీకరిస్తుంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, మంగ్లీ తన గాత్రాన్ని అందించారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ మ్యూజిక్ లో టాప్ ట్రేండింగ్ లో ఉన్నట్లు సమాచారం. వెన్నపూస రమణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, లాస్యారెడ్డి సమర్పిస్తున్నారు.
Latest News