by సూర్య | Thu, Jun 20, 2024, 03:55 PM
అనీల్ కన్నెగంటి దర్శకత్వంలో యంగ్ హీరో అశ్విన్ బాబు నటించిన హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'హిడింభ' జులై 20, 2023న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా జూన్ 20, 2024 రాత్రి 09.30 గంటలకు స్టార్ మా మూవీస్ ఛానెల్‌లో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా ప్రదర్శించబడుతుంది. ఈ సినిమా అశ్విన్ సరసన జోడిగా నందితా శ్వేత నటిస్తుంది. సుభలేఖ సుధాకర్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. SVK సినిమాస్ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వికాస్ బాదిసా సంగీతం అందించారు.
Latest News