డిజిటల్ ఎంట్రీకి సిద్ధంగా ఉన్న 'నడికర్ తిలగం'

by సూర్య | Wed, Jun 19, 2024, 06:29 PM

మలయాళ స్టార్ హీరో టోవినో థామస్‌ నటించిన 'నడికర్ తిలగం' సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 3, 2024 థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ చిత్రంలో టోవినో థామస్ సూపర్ స్టార్ డేవిడ్ పడిక్కల్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ఫ్లిక్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జూన్ 21న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. సౌబిన్ షాహిర్ బాల పాత్రలో కనిపించనుండగా, భావన కథానాయిక. ధ్యాన్ శ్రీనివాసన్, అనూప్ మీనన్, షైన్ టామ్ చాకో, అజు వర్గీస్, శ్రీనాథ్ భాసి, లాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ఫేమ్ లాల్ జీన్ పాల్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి అల్లన్ ఆంటోని మరియు అనూప్ వేణుగోపాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. యక్జాన్ గారి పెరీరా మరియు నేహా ఎస్ నాయర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

Latest News
 
'బగీరా' బుకింగ్స్ ఓపెన్ అయ్యేది ఎప్పుడంటే...! Mon, Oct 28, 2024, 07:40 PM
'ధూమ్ ధామ్' వైజాగ్ పెయిడ్ ప్రీమియర్ వివరాలు Mon, Oct 28, 2024, 07:31 PM
'క' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తేదీ లాక్ Mon, Oct 28, 2024, 07:26 PM
రేపే 'జీబ్రా' విడుదల తేదీ అనౌన్స్మెంట్ Mon, Oct 28, 2024, 07:24 PM
డైరెక్టర్ కార్తీక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మిరాయ్' టీమ్ Mon, Oct 28, 2024, 06:25 PM