యూట్యూబ్ లో 'కన్నప్ప' టీజర్ కి భారీ స్పందన

by సూర్య | Wed, Jun 19, 2024, 02:51 PM

టాలీవుడ్ హీరో విష్ణు మంచు కలల ప్రాజెక్ట్ 'కన్నప్ప' చాలా సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ప్రారంభమైంది. మహాభారతం సీరియల్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ పాన్ ఇండియన్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ ని గ్రాండ్ ఈవెంట్ లో విడుదల చేసారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా టీజర్ 10 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకొని యూట్యూబ్ లో ట్రేండింగ్ వన్ పోసిషన్ లో ఉన్నట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ చిత్రంలో ప్రభాస్, నయనతార, మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, శరత్‌కుమార్, అక్షయ్ కుమార్ మరియు మధుబాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రానుంది. మణిశర్మ మరియు స్టీఫెన్ దేవాసి ఈ చిత్రానికి సంగీత దర్శకులు. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై కన్నప్పను లెజెండరీ నటుడు మోహన్‌బాబు నిర్మిస్తున్నారు.

Latest News
 
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM
అశ్వత్ మరిముత్తుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన శింబు Fri, Oct 25, 2024, 08:06 PM
మైసూరులో 'RC16' ఫస్ట్ షెడ్యూల్? Fri, Oct 25, 2024, 07:58 PM