'భలే ఉన్నాడే' లోని సెకండ్ సింగల్ లిరికల్ షీట్ అవుట్

by సూర్య | Mon, Jun 17, 2024, 10:19 PM

మారుతీ దర్శకత్వంలో రాజ్ తరుణ్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన  సంగతి అందరికి తెలిసిందే.  ఈ చిత్రానికి భలే ఉన్నాడే అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమాలోని సెకండ్ సింగల్ ని సెట్ అవుతుందా పెయిరు అనే టైటిల్ తో విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం ఈ సాంగ్ యొక్క లిరికల్ షీట్ ని విడుదల చేసింది. గీతా సుబ్రమణ్యం, పెళ్లి గోల 2, యు అండ్  ఐ హలో వరల్డ్ వంటి అనేక విజయవంతమైన వెబ్ షోలను అందించిన నూతన దర్శకుడు జె శివసాయి వర్ధన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మనీషా కంద్కూర్ కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాస్, అమ్ము అభిరామి, లీలా శాంసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ సినిమాని రవికిరణ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం.1గా ఎన్.వి.కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మారుతీ టీమ్ ప్రొడక్ట్ సమర్పిస్తుంది.

Latest News
 
సంగీత దర్శకుడు AR రెహమాన్ కు అస్వస్థత Sun, Mar 16, 2025, 11:22 AM
నటి రన్యా రావు సంచలన ఆరోపణలు Sun, Mar 16, 2025, 11:17 AM
‘ది ప్యారడైజ్’ కీలక పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ ? Sun, Mar 16, 2025, 10:42 AM
హీరో విశ్వక్ సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ Sun, Mar 16, 2025, 10:35 AM
'జాక్' సెకండ్ సింగల్ విడుదల ఎప్పుడంటే..! Sat, Mar 15, 2025, 08:49 PM