'లక్కీ బాస్కర్' నుండి శ్రీమతి గారు సాంగ్ ప్రోమో రిలీజ్

by సూర్య | Mon, Jun 17, 2024, 07:46 PM

టాలీవుడ్ యువ దర్శకుడు వెంకీ అట్లూరి తన తదుపరి చిత్రాన్ని మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌ తో చేయనున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దుల్కర్ సల్మాన్ యొక్క మూడవ స్ట్రెయిట్ తెలుగు సినిమా అయ్యిన ఈ సినిమాపై సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి 'లక్కీ బాస్కర్' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ప్రోమోని శ్రీమతి గారు అనే టైటిల్ తో విడుదల చేసారు. ఈ ఫుల్ సాంగ్ జూన్ 19, 2024న విడుదల కానుంది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్‌ సరసన జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27, 2024న విడుదల కానుంది.

Latest News
 
ఓపెన్ అయ్యిన 'ఇట్స్ కంప్లికేటేడ్' అడ్వాన్స్ బుకింగ్స్ Sat, Feb 08, 2025, 08:47 PM
లెహంగాలో కళ్లు చెదిరేలా మెరిసిపోతున్న కృతి శెట్టి Sat, Feb 08, 2025, 08:02 PM
త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తా. మీ అందరినీ కలుస్తా : కన్నడ నటుడు దర్శన్‌ Sat, Feb 08, 2025, 07:37 PM
'అఖండ 2' ఫస్ట్ లుక్ విడుదల అప్పుడేనా? Sat, Feb 08, 2025, 06:49 PM
'నిలవకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్' ట్రైలర్ విడుదల ఎప్పుడంటే..! Sat, Feb 08, 2025, 06:43 PM