త్వరలో విడుదల కానున్న 'డబుల్ ఇస్మార్ట్' ఫస్ట్ సింగల్

by సూర్య | Mon, Jun 17, 2024, 07:04 PM

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని మరియు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'డబుల్ ఇస్మార్ట్' అనే టైటిల్ ని లాక్ చేసి అధికారికంగా లాంచ్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకరాం, మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ని త్వరలో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న రోజులలో సాంగ్ యొక్క అధికారక విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించనుంది. ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడిగా కావ్య థాపర్ నటిస్తుంది. ఈ సినిమా ఆగష్టు 15, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ సినిమాల్లోని ప్రేక్షకులను ఆకట్టుకునేలా పలు భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. పూరి జగన్నాధ్ మరియు ఛార్మి కౌర్ కలిసి పూరీ కనెక్ట్స్‌పై, విషు రెడ్డి CEOగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
యోగి బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'కంగువ' టీమ్ Mon, Jul 22, 2024, 06:51 PM
'సరిపోదా శనివారం' నాట్ ఏ టీజర్ కి భారీ రెస్పాన్స్ Mon, Jul 22, 2024, 06:49 PM
బ్రహ్మాజీ తో 'అలనాటి రామచంద్రుడు' టీమ్ ఇంటర్వ్యూ అవుట్ Mon, Jul 22, 2024, 06:46 PM
సమంత కొత్త వెబ్ సిరీస్ కి టైటిల్ లాక్ Mon, Jul 22, 2024, 06:43 PM
ఆఫీసియల్ : విడుదల తేదీని లాక్ చేసిన 'కమిటీ కుర్రోళ్లు' Mon, Jul 22, 2024, 05:27 PM