'మిస్టర్ బచ్చన్' షో రీల్ విడుదలకి టైమ్ లాక్

by సూర్య | Mon, Jun 17, 2024, 02:43 PM

మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజతో ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి తెలిసందే. ఈ సినిమాకి మిస్టర్ బచ్చన్ - నామ్ తో సునా హోగా అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా షో రీల్ ని ఈరోజు మధ్యాహ్నం 4:05 గంటలకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. భారతీయ పారిశ్రామికవేత్త సర్దార్ ఇందర్ సింగ్‌పై దాదాపు 3 రోజుల పాటు జరిగిన నిజ జీవిత ఆదాయపు పన్ను దాడి ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. రవితేజ సరసన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో సత్య, జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

Latest News
 
1M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మట్కా' సెకండ్ సింగల్ Sat, Oct 26, 2024, 02:58 PM
నేడే 'సారంగపాణి జాతకం' ఫస్ట్ సింగల్ విడుదల Sat, Oct 26, 2024, 02:54 PM
బిగ్ బాస్ 8 తెలుగు : ఈ వారం మరో క్రేజీ ఎలిమినేషన్ Sat, Oct 26, 2024, 02:49 PM
'లక్కీ బాస్కర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్స్ గా వస్తుంది ఎవరంటే...! Sat, Oct 26, 2024, 02:45 PM
'దేవకి నందన వాసుదేవ' వరల్డ్ వైడ్ థియేటర్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, Oct 26, 2024, 02:40 PM