వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'స్కంద'

by సూర్య | Sat, Jun 15, 2024, 05:10 PM

పవర్‌ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన పాన్-ఇండియా సినిమా 'స్కంద ది ఎటాకర్' యొక్క శాటిలైట్ రైట్స్ ని జీ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం జూన్ 16, 2024న రాత్రి 08:00 గంటలకు జీ సినిమా ఛానల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ను ప్రదర్శించనుంది. ఈ సినిమాలో రామ్ సరసన శ్రీలీల జోడిగా నటిస్తుంది. సాయి మంజ్రేకర్, ప్రిన్స్ సెసిల్, గౌతమి, ఇంద్రజ, రాజా, శ్రీకాంత్, శరత్ లోహితాశ్వ, పృథ్వీరాజ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఫుల్ మాస్‌ ఎలిమెంట్స్‌తో వచ్చిన ఈ సినిమాని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.

Latest News
 
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM
అశ్వత్ మరిముత్తుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన శింబు Fri, Oct 25, 2024, 08:06 PM
మైసూరులో 'RC16' ఫస్ట్ షెడ్యూల్? Fri, Oct 25, 2024, 07:58 PM