కొత్త షెడ్యూల్ ని ప్రారంభించిన 'లక్కీ బాస్కర్'

by సూర్య | Sat, Jun 15, 2024, 04:00 PM

టాలీవుడ్ యువ దర్శకుడు వెంకీ అట్లూరి తన తదుపరి చిత్రాన్ని మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌ తో చేయనున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దుల్కర్ సల్మాన్ యొక్క మూడవ స్ట్రెయిట్ తెలుగు సినిమా అయ్యిన ఈ సినిమాపై సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి లక్కీ బాస్కర్ అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా సెప్టెంబర్ 27, 2024న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క కొత్త షెడ్యూల్ ని ముంబై లో ప్రారంభించినట్లు సమాచారం. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్‌ సరసన జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM
లోకేష్ కనగరాజ్ షార్ట్ ఫిల్మ్ గురించిన అప్డేట్ Sat, Oct 26, 2024, 08:47 PM
నేను చాలా సంతోషంగా ఉన్నా: రేణూ దేశాయ్‌ Sat, Oct 26, 2024, 08:47 PM
'లక్కీ బాస్కర్' రన్ టైమ్ లాక్ Sat, Oct 26, 2024, 07:18 PM