పుష్ప సెకండ్ సింగిల్ రిలీజ్....

by సూర్య | Wed, May 29, 2024, 03:04 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జోడీగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప2'. ఈ సినిమాని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతుంది. ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లోనూ సంచలన విజయాన్ని అందుకుంది. అలాగే, ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. దీంతో పుష్ప ది రైజ్ సీక్వెల్‌గా 'పుష్ప ది రూల్' మూవీని తీస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంపై అప్పటి నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని ఆగస్టు 15వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేసేశారు. ఇటీవలే టీజర్‌తో పాటు ఓ పాటను కూడా వదిలారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ చిత్రం నుంచి 'సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామీ' అంటూ సాగే సెకెండ్ సాంగ్‌ను విడుదల చేశారు. కపుల్ సాంగ్‌ను చంద్రబోస్ రాశారు. దీన్ని దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేయగా.. శ్రేయా ఘోషల్ ఆలపించారు. ఈ పాటకు గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేశారు. ఈ లిరికల్ వీడియోలో ప్రాక్టీస్ సెషన్ విజువల్స్‌ను మాత్రమే చూపించారు. అయినప్పటికీ ఇది ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా ఇందులో హుక్ స్టెప్ అదిరేలా ఉంది. మొత్తానికి ఈ పాట కూడా అన్ని వర్గాలను మెప్పిస్తుందని చెప్పొచ్చు.

Latest News
 
హాట్ స్టిల్స్ తో రెచ్చిపోయిన శ్రద్ద దాస్‌ Fri, Sep 20, 2024, 12:56 PM
చీరకట్టులో అందంగా ముస్తాబైన మీనాక్షి చౌదరీ Fri, Sep 20, 2024, 12:49 PM
మా ఇండస్ట్రీలో కుల, మత భేదాలు లేవు: సినీ నిర్మాత సి కళ్యాణ్ Fri, Sep 20, 2024, 12:39 PM
ఒకే గదిలో సుమారు 50 మంది ఉండేవాళ్లం : త్రిప్తి డిమ్రి Fri, Sep 20, 2024, 12:17 PM
నేడు మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. రూ.99కే సినిమా చూసే ఛాన్స్‌ Fri, Sep 20, 2024, 10:27 AM