ధనుష్ 'రాయన్' వాయిదా పడనుందా?

by సూర్య | Tue, May 28, 2024, 06:21 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన ల్యాండ్‌మార్క్ 50వ చిత్రానికి తానే స్వయంగా దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'రాయన్' అనే టైటిల్ ని లాక్ చేసారు. మొదట తమిళం, తెలుగు మరియు హిందీలో జూన్ 13, 2024న థియేటర్లలో విడుదల చేయడానికి షెడ్యూల్ చేయబడిన ఈ చిత్రం విడుదల తేదీ వాయిదా పడే అవకాశం ఉంది. జూలై లేదా ఆగస్ట్‌లో సినిమా విడుదలకు రీ షెడ్యూల్ చేయవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంకా ఈ వియూషయానికి సంబందించిన అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమాలో విష్ణు విశాల్, దుషార విజయన్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వరాఘవన్, ప్రకాష్ రాజ్, అపర్ణ బాలమురళి మరియు SJ సూర్య కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ధనుష్ పవర్ ఫుల్ క్యామియోలో కనిపించనున్నాడు. నార్త్ మద్రాస్ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని సమాచారం. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు.

Latest News
 
డిజిటల్ ఎంట్రీ తేదీ లాక్ చేసిన 'సరిపోదా శనివారం' Sat, Sep 21, 2024, 02:16 PM
పొట్టి డ్రెస్ లో మెహ్రీన్ Sat, Sep 21, 2024, 12:53 PM
వెంకీ అండ్ టీంకు బాలకృష్ణ సర్ప్రైజ్ Sat, Sep 21, 2024, 12:47 PM
త్వరలో నెట్ ఫ్లిక్స్ లో `సరిపోదా శనివారం` Sat, Sep 21, 2024, 12:42 PM
గ్రీస్ లో సుకుమార్ భార్య తబితా సందడి Sat, Sep 21, 2024, 11:23 AM