డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'లైన్‌మ్యాన్' కన్నడ వెర్షన్

by సూర్య | Tue, May 28, 2024, 06:09 PM

వి రఘు శాస్త్రి దర్శకత్వంలో నటుడు త్రిగుణ్ నటించిన 'లైన్‌మ్యాన్' చిత్రం మార్చి 15న తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల అయ్యింది. ఈ సినిమా యొక్క కన్నడ వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజగా ఇప్పుడు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం ఈ సినిమా కన్నడ వెర్షన్ ప్రసారానికి అందుబాటులోకి వచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది. మైకో నాగరాజు, చేతన్ గంధర్వ, దిలీప్ కుమార్, సందీప్ కెంపేగౌడ, శ్రీ దత్తా, సమర్థ్ నర్సింరాజు, సుహైల్ రసూల్, గౌరవ్ శెట్టి, కాజల్ కుందర్, బి జయశ్రీ, నివిక్ష నాయుడు, హరిణి శ్రీకాంత్, సుజయ్ శాస్త్రి, అపూర్వ శ్రీ మరియు ఇతరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన పర్పుల్ రాక్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రచుర పి, కద్రి మణికాంత్, జ్యోతి రఘు శాస్త్రి మరియు భాలా స్టూడియోస్ సహ నిర్మాతలుగా ఉన్నారు. కద్రి మణికాంత్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM