'విశ్వంభర' సెట్స్ లో జాయిన్ అయ్యిన ఆషిక రంగనాథ్

by సూర్య | Tue, May 28, 2024, 03:26 PM

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బింబిసార ఫేమ్ దర్శకుడు వస్సిష్ట మల్లిడితో కలిసి ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'విశ్వంభర' అనే టైటిల్‌ను మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రకటన మొదటి రోజు నుండి అభిమానులలో విపరీతమైన అంచనాలను సృష్టించింది. ఈ భారీ బడ్జెట్ సినిమా చిరంజీవి కెరీర్‌లో 156వ ప్రాజెక్ట్. ఈ సినిమాలో చిరంజీవి దొరబాబు పాత్రలో రాయల్ లుక్‌లో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. తాజాగా నటి ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యినట్లు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంలో సురభి, రమ్య పసుపులేటి, ఈషా చావ్లా మరియు అశ్రిత వేముగంటి నండూరి కీలక పాత్రలలో కనిపించనున్నారు. రచయిత-నటుడు నుండి దర్శకుడిగా మారిన హర్ష వర్ధన్ ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ ఫాంటసీ డ్రామా జనవరి 10, 2025న విడుదల కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని నిర్మిస్తుంది. ఈ సినిమాకి ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ MM కీరవాణి సౌండ్‌ట్రాక్‌ను స్కోర్ చేస్తున్నారు.

Latest News
 
జ్యోతి రాయ్‌ అందాల ఆరబోత ! Mon, Sep 23, 2024, 12:42 PM
ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్ అవ్వడం పై జాన్వీ కపూర్ రియాక్షన్ Mon, Sep 23, 2024, 11:21 AM
మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరిటాన్ని దక్కించుకున్న రియా సింఘా Mon, Sep 23, 2024, 11:16 AM
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM