'దేవకీ నందన వాసుదేవ' సెకండ్ సింగల్ విడుదలకి తేదీ లాక్

by సూర్య | Tue, May 28, 2024, 02:54 PM

గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'దేవకీ నందన వాసుదేవ' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ పెట్టారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క సెకండ్ సింగల్ ని జై బోలో కృష్ణ అనే టైటిల్ తో మే 31న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ కథ అందించగా, ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. ఈ చిత్రంలో అశోక్ సరసన వారణాసి మానస జోడిగా నటిస్తుంది. లలితాంబిక ప్రొడక్షన్స్‌లో ప్రొడక్షన్‌ నెం. 1గా ఎన్‌ఆర్‌ఐ (సినిమా డిస్ట్రిబ్యూటర్‌) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు. ప్రముఖ స్వరకర్త భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

Latest News
 
'దేవర' రిలీజ్ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ Mon, Sep 23, 2024, 08:27 PM
వదిన గురించి నిహారిక ఏమన్నారంటే.. Mon, Sep 23, 2024, 07:56 PM
శ్రద్ధా దాస్ గ్లామర్ షో Mon, Sep 23, 2024, 07:45 PM
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'వెట్టయన్' ప్రివ్యూ Mon, Sep 23, 2024, 07:37 PM
'జనక అయితే గనక' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ Mon, Sep 23, 2024, 07:34 PM