శర్వానంద్ తదుపరి చిత్రం గురించి తాజా అప్‌డేట్

by సూర్య | Sat, May 25, 2024, 06:31 PM

టాలీవుడ్ స్టార్ హీరో శర్వానంద్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ ని చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ తాత్కాలికంగా శర్వానంద్ 36 అనే టైటిల్‌ ని పెట్టారు. ఈ చిత్రంలో మహిళా ప్రధాన పాత్రలో మహానటి ఫేమ్ మాళవిక నాయర్‌ కనిపించనుంది. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇటీవలే శర్వానంద్ ప్రముఖ నటుడు రాజశేఖర్, బ్రహ్మాజీలతో షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లు సమాచారం. ఇప్ప‌టికే స‌గానికి పైగా చిత్రీక‌ర‌ణ‌ చేయ‌గా మిగిలిన పార్ట్‌ల‌ను వ‌చ్చే షెడ్యూల్‌లో పూర్తి చేయ‌నున్నారు. తదుపరి దశ చిత్రీకరణ వచ్చే నెలలో ప్రారంభం కానుందని సమాచారం. ప్రతిష్టాత్మక ప్రొడక్షన్ బ్యానర్ అయిన యువి క్రియేషన్స్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తుంది. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రానున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.

Latest News
 
USAలో $200K మార్క్ ని చేరుకున్న 'మహారాజా' Mon, Jun 17, 2024, 10:28 PM
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'కల్కి 2898 AD' లోని భైరవ ఎంతమ్ సాంగ్ Mon, Jun 17, 2024, 10:25 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'బాయ్స్ హాస్టల్' Mon, Jun 17, 2024, 10:23 PM
YT మ్యూజిక్ ట్రేండింగ్ లో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' లోని మాట్టాడకుండా వీడియో సాంగ్ Mon, Jun 17, 2024, 10:21 PM
'భలే ఉన్నాడే' లోని సెకండ్ సింగల్ లిరికల్ షీట్ అవుట్ Mon, Jun 17, 2024, 10:19 PM