కార్తీ 'మెయ్యజగన్' ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన స్పందన

by సూర్య | Sat, May 25, 2024, 05:42 PM

కోలీవుడ్ నటుడు కార్తీ తన 27వ సినిమాని C. ప్రేమ్ కుమార్‌తో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. తాత్కాలికంగా కార్తీ 27 అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీలో భారీ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం టైటిల్‌ను, ఫస్ట్‌లుక్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. మెయ్యళగన్ అనే టైటిల్‌తో కార్తీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి అభిమానులు మరియు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. అరవింద్ స్వామి కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ కార్తీ, అరవింద్ స్వామి మధ్య ఉన్న స్నేహ బంధాన్ని చూపించింది. ఈ చిత్రంలో రాజ్‌కిరణ్, శ్రీ దివ్య, స్వాతి కొండే, దేవదర్శిని, జయప్రకాష్, శ్రీ రంజని, ఇళవరసు, కరుణాకరన్, శరణ్, రేచల్ రెబెక్కా, ఆంథోని, రాజ్‌కుమార్, ఇందుమతి, రాణి సంయుక్త, కాయల్ సుబ్రమణి, అశోక్ పాండియన్, తదితరులు కీలక పాత్రలలో నటించారు. గోవింద్ వసంత ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రం కుంభకోణం మరియు శివగంగైలోని అద్భుతమైన ప్రదేశాలలో చిత్రీకరించబడింది. ఎడిటింగ్, నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా ముగింపు దశకు చేరుకున్నాయి. 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌పై జ్యోతిక మరియు సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, రాజశేఖర్ కర్పూరసుందరపాండియన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Latest News
 
USAలో $200K మార్క్ ని చేరుకున్న 'మహారాజా' Mon, Jun 17, 2024, 10:28 PM
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'కల్కి 2898 AD' లోని భైరవ ఎంతమ్ సాంగ్ Mon, Jun 17, 2024, 10:25 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'బాయ్స్ హాస్టల్' Mon, Jun 17, 2024, 10:23 PM
YT మ్యూజిక్ ట్రేండింగ్ లో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' లోని మాట్టాడకుండా వీడియో సాంగ్ Mon, Jun 17, 2024, 10:21 PM
'భలే ఉన్నాడే' లోని సెకండ్ సింగల్ లిరికల్ షీట్ అవుట్ Mon, Jun 17, 2024, 10:19 PM