కరణ్ జోహార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'దేవర' టీమ్

by సూర్య | Sat, May 25, 2024, 04:42 PM

కొరటాల శివ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక చిత్రాన్ని ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ చిత్రానికి 'దేవర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదల కానుంది. తాజాగా చిత్ర బృందం స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. కరణ్ జోహార్ దేవర సినిమాని నార్త్ లో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, శృతిమరాఠే, తారక్ పొన్నప కీలక పాత్ర పోషిస్తున్నారు. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఎ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
సినీ నటుడు విజయ్‌ రంగరాజు కన్నుమూత Mon, Jan 20, 2025, 12:38 PM
ప్రభాస్ 'ది రాజా సాబ్' నుంచి సీన్ లీక్..... Mon, Jan 20, 2025, 12:13 PM
అఖిల్ పెళ్ళికి ముహూర్తం కుదిరింది Mon, Jan 20, 2025, 11:58 AM
చిరంజీవితో సినిమా పై అనిల్ ఆసక్తికరవ్యాఖ్యలు Sun, Jan 19, 2025, 05:40 PM
కామెడీతో రానున్న వరుణ్ తేజ్ Sun, Jan 19, 2025, 05:40 PM