by సూర్య | Sat, May 25, 2024, 02:41 PM
నూతన దర్శకుడు ఉదయ్ శెట్టి దర్శకత్వంలో నటుడు ఆనంద్ దేవరకొండ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'గం గం గణేశ' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ ని క్లియర్ చేసుకొని U/A సర్టిఫికెట్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా, వెన్నెల కిషోర్ మరియు జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. హైలైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఈ సినిమా మే 31, 2024న విడుదల కానుంది.
Latest News