250 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'ప్రేమలు'

by సూర్య | Fri, May 24, 2024, 05:44 PM

గిరీష్ ఎడి దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ సినిమా ప్రేమలు ఈ సంవత్సరం మాలీవుడ్‌లో విడుదలైన బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలో నస్లెన్ కె గఫూర్ మరియు మమితా బైజు ప్రధాన జంటగా నటించారు. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి ఉంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ హిట్ సినిమా ఇప్పటివరకు 250 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసినట్లు సమాచారం. ఇదే విషయాన్ని మూవీ మేకర్స్ తమ సోషల్ ప్రొఫైల్స్‌లో అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో శ్యామ్ మోహన్ ఎమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిలా భార్గవన్, అల్తాఫ్ సలీం, మాథ్యూ థామస్ మరియు సంగీత్ ప్రతాప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విష్ణు విజయ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.

Latest News
 
పహల్గామ్‌ ఉగ్రవాద దాడి పై పవన్ కళ్యాణ్ ట్వీట్ Wed, Apr 23, 2025, 08:08 AM
'చౌర్య పాఠం' సెన్సార్ పూర్తి Wed, Apr 23, 2025, 07:59 AM
'OG' విడుదల అప్పుడేనా? Wed, Apr 23, 2025, 07:55 AM
సెన్సార్ పూర్తి చేసుకున్న 'సారంగపాణి జాతకం' Wed, Apr 23, 2025, 07:50 AM
అన్ని భాషలలో విడుదలైన 'హిట్ 3' సెకండ్ సింగల్ Wed, Apr 23, 2025, 07:44 AM