బజ్ : పుష్ప 2 స్పెషల్ సాంగ్ లో యానిమల్ బ్యూటీ

by సూర్య | Fri, May 24, 2024, 04:10 PM

సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2019లో బ్లాక్‌బస్టర్ మూవీస్ లో ఒకటైన పుష్ప: ది రైజ్‌కి సీక్వెల్ గా పుష్ప 2: ది రూల్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమాలోని మొదటి సింగిల్ ని పుష్ప పుష్ప అనే టైటిల్ తో విడుదల చేయగా ఈ హై-ఎనర్జీ ట్రాక్ బహుళ భారతీయ భాషలలో 50 మిలియన్లకు పైగా వీక్షణలను సంపాదించింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమిరి కనిపించనున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఆగష్టు 15, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన్న నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్ భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీసాఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, సునీల్, జగదీష్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పుష్ప 2ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

Latest News
 
USAలో $200K మార్క్ ని చేరుకున్న 'మహారాజా' Mon, Jun 17, 2024, 10:28 PM
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'కల్కి 2898 AD' లోని భైరవ ఎంతమ్ సాంగ్ Mon, Jun 17, 2024, 10:25 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'బాయ్స్ హాస్టల్' Mon, Jun 17, 2024, 10:23 PM
YT మ్యూజిక్ ట్రేండింగ్ లో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' లోని మాట్టాడకుండా వీడియో సాంగ్ Mon, Jun 17, 2024, 10:21 PM
'భలే ఉన్నాడే' లోని సెకండ్ సింగల్ లిరికల్ షీట్ అవుట్ Mon, Jun 17, 2024, 10:19 PM