'నింద' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ ఖరారు

by సూర్య | Thu, May 23, 2024, 05:08 PM

రాజేష్ జగన్నాధం దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో వరుణ్ సందేశ్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'నింద' అనే టైటిల్ ని లాక్ చేసారు. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని చిత్ర బృందం విడుదల చేసి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ సంకెళ్లు అనే టైటిల్ తో రేపు సాయంత్రం 5 గంటలకి విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియాలో స్పెషల్ వీడియో ని విడుదల చేసి అధికారికంగా ప్రకటించారు. సంతు ఓంకార్ సంగీతం అందించగా, రమీజ్ నవీత్ క్రాంక్ చేసిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అన్నీ, తనికెళ్ల భరణి, భద్రమ్, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Latest News
 
బికినీలో దర్శనమిచ్చిన మృణాల్.. నిజమిదే.. Fri, Oct 18, 2024, 09:03 PM
టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌.. అనన్య నాగళ్ల ఏమన్నారంటే? Fri, Oct 18, 2024, 09:01 PM
'లక్కీ బాస్కర్' ట్రైలర్ లాంచ్ కి వెన్యూ ఖరారు Fri, Oct 18, 2024, 08:28 PM
'SDGM' ఫస్ట్ లుక్ విడుదలకి టైమ్ లాక్ Fri, Oct 18, 2024, 07:38 PM
'తలపతి69' లో విజయ్ పాత్రపై లేటెస్ట్ అప్డేట్ Fri, Oct 18, 2024, 07:32 PM