'భజే వాయు వేగం' ట్రైలర్ విడుదలకి తేదీ లాక్

by సూర్య | Thu, May 23, 2024, 04:26 PM

నూతన దర్శకుడు ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'బజే వాయు వేగం' అనే టైటిల్ ని మూవీ మేక్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని మే 25న మధ్యాహ్నం 12:15 గంటలకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రం మే 31, 2024న విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో ఐశ్వర్యా మీనన్ కథానాయికగా నటిస్తుంది. హ్యాపీడేస్ ఫేమ్ రాహుల్ టైసన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాని యువి క్రియేషన్స్ సమర్పణలో యువి కాన్సెప్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. పి అజయ్ కుమార్ రాజు సహ నిర్మాతగా ఉన్నారు. ఈ చిత్రానికి రధన్ సంగీతం సమకూర్చనున్నారు.

Latest News
 
రాశి ఖన్నా గ్లామర్ ట్రీట్‌ Sat, Oct 19, 2024, 08:54 PM
ఈ హాట్ బ్యూటీని పెళ్లాడనున్న సుప్రీమ్ హీరో? Sat, Oct 19, 2024, 08:54 PM
చండీ హోమం చేసిన రేణూ దేశాయ్‌ Sat, Oct 19, 2024, 08:39 PM
'గేమ్ ఛేంజర్' స్పెషల్ సాంగ్ కోసం భారీ బడ్జెట్ Sat, Oct 19, 2024, 07:42 PM
బిగ్ బాస్ 8 తెలుగు: ట్రోఫీ కోసం పోరాడుతున్న ఈ ఇద్దరు ప్రముఖులు Sat, Oct 19, 2024, 07:31 PM