ఆఫీసియల్ : సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'లవ్ మి - ఇఫ్ యు డేర్'

by సూర్య | Thu, May 23, 2024, 03:39 PM

రౌడీ బాయ్స్‌లో తన పాత్రతో పేరు తెచ్చుకున్న ఆశిష్ రెడ్డి ఇటీవల నూతన దర్శకుడు అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకు లవ్ మి – ఇఫ్ యు డేర్ అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా మే 25, 2024న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ ని క్లియర్ చేసుకొని U/A సర్టిఫికెట్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. వైష్ణవి చైతన్య ఈ సినిమాలో ఆశిష్ రెడ్డి సరసన నటించనుంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షితారెడ్డి, నాగ మల్లిడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
'పొటెల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Mon, Oct 21, 2024, 11:46 AM
యూట్యూబ్ లో 'మెకానిక్ రాకీ' ట్రైలర్ కి భారీ స్పందన Mon, Oct 21, 2024, 11:37 AM
సిటాడెల్ హనీ బన్నీ కోసం నేను అనుకున్న మొదటి నటి సమంత - వరుణ్ ధావన్ Mon, Oct 21, 2024, 11:31 AM
యాక్షన్‌తో కూడిన 'బగీరా' ​​ట్రైలర్ అవుట్ Mon, Oct 21, 2024, 11:25 AM
తన కాబోయే భార్య శోభితా ధూళిపాళతో కలిసి పోజులిచ్చిన నాగ చైతన్య Mon, Oct 21, 2024, 11:20 AM