'రాయన్' సెకండ్ సింగల్ విడుదలకి తేదీ ఖరారు

by సూర్య | Wed, May 22, 2024, 06:58 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన ల్యాండ్‌మార్క్ 50వ చిత్రానికి తానే స్వయంగా దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'రాయన్' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ సినిమా యొక్క సెకండ్ సింగల్ ని మే 24న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం జూన్ 13న విడుదల కానుంది. ఈ సినిమాలో విష్ణు విశాల్, దుషార విజయన్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వరాఘవన్,ప్రకాష్ రాజ్, అపర్ణ బాలమురళి మరియు SJ సూర్య కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ధనుష్ పవర్ ఫుల్ క్యామియోలో కనిపించనున్నాడు. నార్త్ మద్రాస్ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని సమాచారం. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు.

Latest News
 
సమంత షాకింగ్ కామెంట్స్!... నేను అలా ప్రవర్తించి ఉండాల్సింది Tue, Oct 22, 2024, 07:44 PM
సన్నీ డియోల్ 'జాట్' లో సన్నీ లియోన్? Tue, Oct 22, 2024, 07:42 PM
'మా నాన్న సూపర్‌హీరో' నుండి వేడుకలో వీడియో సాంగ్ రిలీజ్ Tue, Oct 22, 2024, 07:36 PM
గంగవ్వకు గుండెపోటు ? Tue, Oct 22, 2024, 07:34 PM
'లగ్గం' స్పెషల్ ప్రీమియర్ ఎప్పుడంటే...! Tue, Oct 22, 2024, 07:28 PM