'గం గం గణేశ' ట్రైలర్ కి యూట్యూబ్ లో భారీ రెస్పాన్స్

by సూర్య | Wed, May 22, 2024, 04:41 PM

నూతన దర్శకుడు ఉదయ్ శెట్టి దర్శకత్వంలో నటుడు ఆనంద్ దేవరకొండ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'గం గం గణేశ' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా మే 31, 2024న విడుదల కానుంది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని విడుదల చేసారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో ట్రేండింగ్ 6 పోసిషన్ లో ఉన్నట్లు సమాచారం. ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా, వెన్నెల కిషోర్ మరియు జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. హైలైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.

Latest News
 
త్రిషకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా..? Sun, Oct 20, 2024, 02:47 PM
భారత్ లో అత్యంత ధనవంతులైన నటీమణులు వీరే Sun, Oct 20, 2024, 02:42 PM
కిచ్చా సుదీప్ ఇంట్లో తీవ్ర విషాదం Sun, Oct 20, 2024, 02:39 PM
ఫెయిల్యూర్‌ మీట్‌ పెట్టుకున్న 'లవ్‌ రెడ్డి' మూవీ టీమ్‌ Sun, Oct 20, 2024, 01:44 PM
లిఫ్ట్‌లో కాబోయే భార్యతో నాగచైతన్య Sun, Oct 20, 2024, 11:16 AM