'కల్కి 2898 AD' హైదరాబాద్ ఈవెంట్ ని హోస్ట్ చేయనున్న హనుమాన్ నటుడు

by సూర్య | Wed, May 22, 2024, 04:13 PM

నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాకి మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ కల్కి 2898 AD అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి భైరవ బుజ్జిని కలిసికొండి అంటూ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మే 22న 5 గంటల నుండి ఈవెంట్ ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ మెగా ఈవెంట్‌కి అభిమానులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ఈ ఈవెంట్‌ను హనుమాన్ నటుడు తేజ సజ్జా హోస్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ వేడుకకు ప్రభాస్‌తో పాటు టీమ్ అంతా హాజరుకానున్నారు. ఈ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో యంగ్ రెబెల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె నటిస్తుంది. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో కమల్ హాసన్, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ మరియు ఇతరులు కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ సినిమా జూన్ 27, 2024న విడుదల కానుంది. ఈ హై బడ్జెట్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
మోడ్రన్ ఔట్ ఫిట్‌లో నేహా శెట్టి మైండ్ బ్లోయింగ్ అందాలు Sat, Oct 19, 2024, 09:03 PM
రాశి ఖన్నా గ్లామర్ ట్రీట్‌ Sat, Oct 19, 2024, 08:54 PM
ఈ హాట్ బ్యూటీని పెళ్లాడనున్న సుప్రీమ్ హీరో? Sat, Oct 19, 2024, 08:54 PM
చండీ హోమం చేసిన రేణూ దేశాయ్‌ Sat, Oct 19, 2024, 08:39 PM
'గేమ్ ఛేంజర్' స్పెషల్ సాంగ్ కోసం భారీ బడ్జెట్ Sat, Oct 19, 2024, 07:42 PM